1.
స్నేహితులు లేనివాడు పేదవాడు
ప్రేమలేనివాడు ఒంటరివాడు
స్వార్ధం లేనివాడు అందరివాడు
==================================
2.మనసు బాగా లేకపోతే ,
కుటుంబ సభ్యులతో కాసేపు మనసువిప్పి మాట్లాడండి లేదా
మంచి మిత్రుణ్ణి కలవండి లేదా
మంచి పుస్తకం చదవండి లేదా
మంచి మాటలు , పాటలు వినండి లేదా
మంచి రుచికరమైన ఆహరం తినండి లేదా
హాయిగా కాసేపు నడవండి లేదా
మీకు వీలయితే కొంత సహాయం చెయ్యండి లేదా
కొద్దీ సేపు మౌనం వహించండి.
============================================
3.నిన్ను అవమాన పరిచిన వాళ్ళకి నీ గెలుపు అసూయని కలిగించాలి.
===============================================
4.కష్టాల్లో వున్నప్పుడు అనుభవించిన సుఖాలని గుర్తుకు తెచ్చుకో,
ఆనందంగా వున్నప్పుడు అనుభవించిన కష్టాల్ని గుర్తుకు తెచ్చుకో,
జీవితం చక్రంలో ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయనీ ,
రెండింటిలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో.
=============================================
5. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది.
============================================
6.మనిషి జీవితం శబ్దంతో మొదలై నిశ్శబ్దంతో ముగుస్తుంది కానీ గొప్పవాళ్ళ జీవితం శబ్దంతో మొదలై ప్రపంచానికి దారి చూపిస్తుంది ,ఎంతో మందికి ఆదర్శం అవుతుంది.
============================================
7.మనిషి జీవితం శబ్దంతో మొదలయ్యి నిశ్శబ్దంతో ముగుస్తుంది.
కానీ గొప్పవాళ్ళ జీవితం శబ్దంతో మొదలయ్యి ప్రపంచానికి దారి చూపిస్తుంది, ఏంటో మందికి ఆదర్శం అవుతుంది.
==============================================
8.నీకు ఓర్పు ఉంటే ఉక్కు కవచం వున్నట్లే.
==============================================
9.చాలా విషయాలు మనం అనుకున్నంత పెద్దవి కావు కానీ మనం దాన్ని పెద్దదని ఉహించుకుంటాం, నీకు వీలయినంత చేసి ప్రశాంతగా ఉండాలి.
==========================================
10.ప్రతి రోజు స్నానం చేసి ఎలా అయితే మలినాలని తొలగించు కుంటాం అలాగే మనసులోని మలినాలని కూడా శుభ్రం చేసుకోవాలి.
======================================
11.అన్నీతెలిసిన వారు ఎవరు వుండరు, ఏమీ తెలియని వారు ఎక్కడ వుండరు.
======================================
12.మౌనం కొన్నివేల ప్రశ్నలకు సమాధానం.
======================================
13.తండ్రి పడిన కష్టం తండ్రి అయినప్పుడు అర్ధమవుతుంది.
తల్లి పంచిన ప్రేమ కూతురు చూపించే మమకారంలో కనపడుతుంది.
=================================================
14.నువ్వు గెలిచినప్పుడు నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా గెలుస్తావని అంటారు. నువ్వు ఓడినప్పుడు నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అంటారు. కానీ నువ్వు ఓడినప్పుడు నువ్వు ఎప్పటికైనా గెలుస్తావు అని గెలిచినప్పుడు నువ్వు ఇంకా గెలుస్తావని చెపుతాడు , నువ్వు ఎలాంటి స్థితి లో వున్నా అన్ని పరిస్థితుల్లో నీ తోడుగా వుండే వాడు ఒక్క స్నేహితుడు.
===============================================
15.అరచేతితో సూర్యుణ్ణి ఎలా ఆపలేరో,నీలో ప్రతిభ ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు.
===============================================
16.క్లిష్ట పరిస్థితుల్లో ఓపికగా ఉండటం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఆనందమే.
=====================================================
17.సృష్టిలో అన్నీ రెండు
జననం-మరణం
ఆడ -మగ
మంచి-చెడు
రాత్రి-పగలు
కష్టం-సుకం
జ్ఞానం-అజ్ఞానం
చివరికి కంప్యూటర్లో జీరో-వన్
===========================================================
18.ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లాలంటే మొదటగా ఉన్నతమైన ఆలోచనలు చెయ్యాలి ,ఉన్నతమైన అలవాట్లు చేసుకోవాలి ముక్యంగా వాటిని తూచా తప్పకుండ ఆచరించాలి.
=================
19.సమయమే సంపద , సమయాన్ని ఎప్పుడు వృధా చెయ్యవద్దు.
=================
20.మనసు బాగా లాకా పొతే మంచి పుస్తకం చదువు.
===============