అర్ధనారీశ్వర స్వరూపం చూసినప్పుడు , ఇద్దరు ప్రేమగా కలిసి మెలసి ఉండాలి అనిపిస్తుంది, ఇది యావత్ ప్రపంచానికే ప్రామాణికం అనిపిస్తుంది.
దృఢమైన శరీరం, ప్రశాంతమైన మనసు చూసినప్పుడు జీవితాన్నిగెలవాలంటే దృఢ శరీరం ప్రశాంతమైన మనసు ముఖ్యం అనిపిస్తుంది.
మూడవ కన్నును చూసినప్పుడు , తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే శక్తి ఉండాలని అనిపిస్తుంది.
గొంతులోదాచుకున్న హాలాహలం చూసినప్పుడు, పది మంది క్షేమం కోసం ఎంత బాధనైనా భరించాలని అనిపిస్తుంది.
చేతిలోని త్రిశూలం చూసినప్పుడు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవాలంటే శక్తివంతమైన ఆయిదాలు ఉండాలని అనిపిస్తుంది.
ధ్యానంలో కూర్చున్న నిన్ను చూసినప్పుడు సత్యం తెలుసుకోవాలంటే ధ్యాన మార్గమే గొప్పదని అనిపిస్తుంది.
చేతిలోని డమరుకం చూసినప్పుడు ఇది మానవాళిని మేల్కొలిపే ధ్వని తరంగాల గని అని అనిపిస్తుంది.
ఇంకా ఎన్నో అద్భుత అనుభూతులను , ఆనందాలను కలిగించే నీ దివ్య స్వరూపమే మాకు ఆదర్శం. ఓమ్ నమః శివాయ.
No comments:
Post a Comment