Saturday, November 27, 2021

ముందుకు సాగిపో మిత్రమా

ఉదయించే సూర్యిడిలా-ఆకాశంలో హరివిల్లులా,

ప్రవహించే నదిలా-చెలరేగే నిప్పులా,

సమస్త జీవరాశి మనుగడకై తపించి పరిభ్రమించే ధరిత్రిలా-పరిగెత్తే చిరుతలా,

పరవశంతో పురివిప్పి నాట్యమాడే నెమలిలా-ఆనందంతో గంతులేసే లేడిలా, 

కష్టాలకు కదలక - కన్నీళ్లకు కరుగక,

 సుఖాలకు మరుగక -దుక్ఖాలకు బెదరక ,

గెలిచినప్పుడు గర్వపడక-ఓడినప్పుడు వెన్నుచూపక ,

కష్ట-సుఖాలు, గెలుపు - ఓటములు ఇవన్నీ ఎల్లప్పుడూ శాశ్వతం కావనే నిజం నిత్యం మరువక ,

నువ్వు పంచిన ప్రేమ , చేసిన మంచి ,నీవాళ్లతో గడిపిన మధుర క్షణాలు, తీపి జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతం అని తెలుసుకొని నువ్వు అలుపెరుగని ధీరుడిలా నీ లక్ష్యం వైపు సాగిపో మిత్రమా.

********************************************************************************

వివరణ: నేను పైన చెప్పిన మాటలలో , పంచభూతాలు మరియు కొన్ని విశిష్ట లక్షణాలు వున్నా  జీవులను ప్రేరణ కోసం ఉదాహరించితిని 

ఇట్లు ఈ జీవన సాగర ప్రయాణంలో మీతోటి ప్రయాణికుడిని,మీ ప్రియ మిత్రుడిని 

                            


No comments:

Post a Comment