నేను ప్రొద్దున్నే లేవాలని అనుకుంటాను,
నాతో నేను కాసేపు మౌనంగా గడపాలని అనుకుంటాను,
మంచి ఆలోచనలు చేయాలనుకుంటాను,
వ్యాయామం చేయాలనీ అనుకుంటాను,
మంచి పౌష్టిక ఆహారం తినాలనుకుంటాను,
కష్టపడి పని చేయాలనుకుంటాను,
లక్ష్యం వైపు ఒక అడుగు వెయ్యాలని అనుకుంటాను,
కొత్తగా ఏమైనా చెయ్యాలని, నేర్చుకోవాలని అనుకుంటాను,
మనసుకి హాయిని,శక్తిని ఇచ్చే ఆలోచనలు పెంచుకోవాలని,నచ్చనివి తగ్గించుకోవాలనుకుంటాను,
మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయాలను కుంటాను,
నచ్చిన విషయాలు పంచుకోవాలని , మెచ్చిన విషయాలు నాలో పెంచుకోవాలని , నచ్చని విషయాలు తుంచుకోవాలని అనుకుంటాను,
ప్రేమగా , తృప్తిగా రోజూ వుండాలని అనుకుంటాను,
రాత్రి సుకంగా నిద్ర పోవాలనుకుంటాను,
చివరగా ఓక చిన్న వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను ప్రతీ సారి అనుకుంటున్నాను(thinking) అని రాసాను కదా , ఎందుకలా రాసాను ఒక్కసారి ఆలోచించండి ?
అది ఎందుకంటే ఎప్పుడైనా మార్పు రావాలంటే అది మొదట మనం మన మనసులో మారాలని గట్టిగా అనుకోవాలి అందుకే అనుకుంటున్నాను అని రాసాను.
Good one
ReplyDeleteThank you 👍
ReplyDelete